అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సొంతంగా ఓ సోషల్ మీడియాను ప్రారంభించనున్నారు. ఇది ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు ధీటుగా ఉండనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత అమెరికాలోని క్యాపిటల్ భవన్ంపై ఆయన మద్దతు దారులు దాడులకు దిగారు. ఆ తర్వాత ట్రంప్ సోషల్ మీడియా ఖాతాను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు బహిష్కరించాయి. దీంతో 9 నెలల పాటు ఆయన సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌ను ఏర్పాటు చేసారు.