తాజాగా భారత టెలికాం ధిగ్గజం ఎయిర్ టెల్ 5 జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌లో జతకట్టింది. భారత్‌లో 5జీ సేవలను అందించేందుకు గాను ఎయిర్‌టెల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎరిక్సన్ సంస్థ తెలిపింది. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 36 ఆపరేటర్లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిర్టిల్లో తెలిపారు.
ఎరిక్సన్ ఇప్పటికే ఎయిర్‌టెల్‌కు 4జి తోపాటు ఇతర సేవలందించేందుకు అవసరమైన టెక్నాలజీని అందిస్తూనే ఉంది. ఈ క్రమంలో త్వరలోనే 2జీ, 3జీ సేవలను పూర్తిగా పక్కనబెట్టేందుకు ఎయిర్ టెల్ రంగం సిద్ధం చేసుకుంటోంది. అలాగే 4జీ, 5జీలపైనే పూర్తిగా దృష్టి పెట్టేందుకు ఎయిర్ టెల్ రెడీ అవుతోంది.