ఇంతకీ ఆ ఆవిష్కరణ ఏంటనేదే కదా మీ సందేహం. "వ్యక్తి ఆలోచనను పసిగట్టే పరికరం. మనిషి మెదడులోని ఆలోచనలను, భావాలను చదవగలిగే 'మైండ్ రీడింగ్' పరికరాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలలో జరిగే ఫేస్‌బుక్ వార్షిక సదస్సులో ఈ పరికరాన్ని ఆవిష్కరించనున్నట్టు సమాచారం.
నిజానికి గత యేడాది "బిల్డింగ్ 8" పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేసింది. ఇందులోభాగంగానే మనిషి ఆలోచనలు పసిగట్టే పరికరాన్ని తయారు చేసే పనిలో బిజీగా ఉంది. అంతేకాదు వచ్చే నెలలోనే దానిని ఆవిష్కరించేందుకు ముమ్ముర ఏర్పాట్లు చేస్తోంది. అంతా ఓకేగానీ ఆ పరికరం పేరు "బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్" అని పేరు పెట్టింది.