ఫలితంగా యూజర్లు ఒకరికొకరు మరింత దగ్గరవుతున్నారని, వారితో తమ జర్నీ కొనసాగుతుందని జుకర్ బర్గ్ తన పోస్టులో రాశారు. కాగా 200 కోట్ల యూజర్ల మార్క్‌కు చేరుకున్న సందర్భంగా ఫేస్‌బుక్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. తమ యూజర్ బేస్ కూడా ఏదైనా ఒక దేశం జనాభా కంటే కూడా అధికమని జుకర్ బర్గ్ వెల్లడించింది. ఫేస్ బుక్ సాధించిన ఈ మైలురాయిలో ఇన్ స్టాగ్రామ్ లేదా వాట్సాప్ నెట్ వర్క్ యూజర్లను కలుపలేదని కంపెనీ చెప్పింది.