ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,900లకే ఐఫోన్.. ఎక్స్చేంజ్‌కే ఈ ధర వర్తింపు
బుధవారం, 4 జనవరి 2017 (07:04 IST)
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ యాపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్6 16 జీబీ వేరియంట్‌పై దాదాపు రూ.22,000 మేరకు రాయితీ ప్రకటించింది. ఫలితంగా ఈ ఫోన్ కేవలం రూ.9,990లకే ఫోన్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది.
కొత్త ఐఫోన్ 6ఎస్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని మెలిక పెట్టింది. యాక్సిక్ బ్యాంక్ ద్వారా ఈఎంఐ తీసుకునేవారికి బ్యాంకు నుంచి 5 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఎక్స్ఛేంజ్ లేని వారికి అసలు ధరపై 13 శాతం (రూ.5000) రాయితీ ఇవ్వనుంది.