భారత్‌కు గూగుల్.. రూ.135 కోట్ల రూపాయల విరాళం

సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:05 IST)
కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న భారత్‌కు సహాయం చేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ ముందుకొచ్చింది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు రూ.135 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గివ్ ఇండియాకు, యూనిసెఫ్‌కు ఈ ఫండ్ అందించనున్నట్టు తెలిపారు.
 
భారత్‌కు సహాయమందించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా వంటి దేశాలతోపాటు పాకిస్థాన్ కూడా ముందుకొచ్చింది. కొవిషీల్డ్ టీకా తయారీకి అవసరమైన ముడి పదర్థాలను భారత్‌కు పంపాలని అమెరికా నిర్ణయించింది. అలాగే పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కూడా పంపించనుంది. ఇక, భారత్‌లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ ముందుకొచ్చాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు