గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..

బుధవారం, 7 సెప్టెంబరు 2022 (15:22 IST)
ఇంటర్నెట్ యూజర్లకు గూగుల్ ఓ హెచ్చరిక చేసింది. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ బ్రోజర్ వినియోగించే వారిని హెచ్చరించింది. వీలైనత మేరకు గూగుల్ క్రోమ్ బ్రోజర్ కొత్త వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. లేకుంటే ఇబ్బందులు పడక తప్పదని తెలిపింది. 
 
తాజాగా, గూగుల్ క్రోమ్ బ్రైజర్ (వర్షన్ 105.0.5195.102)లో కొత్త బగ్‌ను గూగుల్ గుర్తించింది. దీంతో గూగుల్ వినియోగదారులను అలెర్ట్ చేసింది. బంగ్ సమస్య నుంచి బయటపడేందుకు కొత్తగా అప్‌డేట్‌ను కూడా విడుదల చేసింది. 
 
విండోస్, మ్యాక్స్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో గూగుల్ క్రోమ్ వినియోగదారుల కోసం సెక్యూరిటీ ప్యాచ్‌ను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. హ్యాకింగ్ ముప్పును నివారించడానికి వీలైనంత త్వరగా క్రోమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని వినియోగదారులకు గూగుల్ విజ్ఞప్తి చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు