గూగుల్ మెసేజెస్ యాప్ సరికొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేసే ఈ గూగుల్ మెసేజెస్ యాప్ ద్వారా పర్సనల్, ట్రాన్సాక్షన్/ ప్రమోషనల్ యాప్స్‌ను వేరు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇక, ట్రాన్సాక్షన్ ధృవీకరణ కోసం వచ్చే "OTP" మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా 24 గంటల్లో డిలీట్ చేసుకునే ఫీచర్‌ను రోలవుట్ చేసింది.
సాధారణంగా మన ఫోన్‌కు ప్రతి రోజు పదుల సంఖ్యలో మెసేజ్‌లు వస్తుంటాయి. పర్సనల్, ప్రమోషన్/ట్రాన్సాక్షన్ మెసేజ్‌లు పెద్ద ఎత్తున్న రావడంతో ఇన్‌బాక్స్ నిండిపోతుంది. అవసరం లేని వాటిని డిలీట్ చేయడం పెద్ద ప్రయాసతో కూడుకున్న పని. అందువల్ల, చాలా మంది వాటిని డిలీట్ చేయకుండానే వదిలేస్తుంటారు. ఇటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టెక్ దిగ్గజం గూగుల్ కొత్తగా రెండు ఫీచర్లను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ముఖ్యమైన మెసేజెస్ను గుర్తించి.. అవసరం లేని వాటిని ఆటోమేటిక్‌గా డిలీట్ చేస్తుంది. అంతేకాక, పర్సనల్, ప్రమోషనల్ మెసేజెస్ను వేర్వేరు కేటగిరీలుగా విభజిస్తుంది. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది.