సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌లో వైవిధ్యం, నైతిక విలువలపై కొనసాగుతున్న వివాదాలు తీవ్రస్ధాయి స్ధాయికి చేరాయి. కృత్రిమ మేథ పరిశోధకుడు టిమ్నిట్ గెబ్రూపై గూగుల్ వేటు వేయడంతో ఇద్దరు టెకీలు సంస్థకు గుడ్‌బై చెప్పారు.
వైవిధ్యంపై గూగుల్ దృష్టిసారిస్తున్నా సంస్థలోపల ఎన్నో గళాలను వినిపించకుండా పోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సెర్చింజన్ దిగ్గజంలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వినీష్ కన్నన్ గూగుల్‌ను వీడుతున్నట్టు బుధవారం ట్వీట్ చేశారు. గెబ్రూ, ఏప్రిల్ క్రిస్టియానాల పట్ల గూగుల్ తీరు ఆక్షేపణీయంగా ఉందని పేర్కొన్నారు. గెబ్రూ, క్రిస్టియానా ఇరువురూ నల్ల జాతీయులు కావడం గమనార్హం.