జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో మొండికేసిన టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలకు రూ.3.050 కోట్ల మేర భారీ జరిమానా విధించేందుకు గవర్నమెంట్ ప్యానెల్ ఆమోదం తెలిపింది. ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అంటూ జియో సంచలనం రేపిన నేపథ్యంలో భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి సంస్థలు జియో కాల్స్‌ను నిరోధించాయని 2016లో ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలపై పెనాల్టీ వేయాలని ట్రాయ్ గవర్నమెంట్ ప్యానల్‌కు సిఫార్సు చేసింది. ఇందుకు తాజాగా గవర్నమెంట్ ప్యానల్ ఆమోదం తెలిపింది. దీనిపై భారతీ ఎయిర్ టెల్ సంస్థ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే నష్టాల్లో వున్న సంస్థపై మరింత భారం పడుతుందని.. ఇది టెలికాం సెక్టార్‌నే ఒత్తిడిలోకి నెట్టేస్తుందని వెల్లడించింది.