మరింత చేరువగా జియో సేవలు... రాష్ట్రంలో 10 వేల మొబైల్ టవర్లు
గురువారం, 11 జులై 2019 (15:27 IST)
భారతదేశ వ్యాప్తంగా జియో సృష్టించిన డిజిటల్ విప్లవం వల్ల డాటా యొక్క శక్తిని ప్రతి ఒక్క పౌరుడు పొందగలిగారు. సమగ్రమైన మొబైల్ నెట్‌వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిబడిన నేపథ్యంలో ఈ డిజిటల్ విప్లవం రాష్ట్ర ప్రజానికానికి మరింత చేరువైంది. తాజాగా జతకూడిన మొబైల్ టవర్ల వల్ల, ఆంధ్రప్రదేశ్‌లో 10,000 టవర్ల కీలక మైలురాయిని జియో చేరుకుంది. దీంతో నెట్వర్క్ పరంగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జియో వినియోగదారులు సైతం జియో యొక్క డిజిటల్ లైఫ్ సేవలను వేగంగా అందిపుచ్చుకున్నారు. 13.07 మిలియన్ల మంది చందాదారులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సేవలను పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల జియో ప్రతి జిల్లా నుంచి అనేక మంది చందాదారులను తన ఖాతాలో జమచేసుకుంటూ ముందుకు సాగుతోంది.
డేటా యొక్క శక్తి ద్వారా ప్రతి భారతీయుడిని శక్తివంతుడిని చేయాలని మరియు వారు అనేక అద్భుతాలను చేసే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో 34 నెలల క్రితం జియో సేవలు ప్రారంభమయ్యాయి. భారతదేశానికి చెందిన డిజిటల్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయడంలో జియో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది.
జియో అరంగేట్రం ద్వారా ప్రపంచంలోనే అతి ఎక్కువ మొబైల్ డాటా వినియోగదారుల్లో భారతదేశం నంబర్ వన్ స్థానంలో నిలిచింది. భారతదేశంలో ఉచిత వాయిస్ కాల్ సేవల కలను జియో నిజం చేసింది. డాటా వైపు ఈ మార్కెట్ వేగంగా సాగింది. ఈ డిజిటల్ విప్లవంలో వినియోగదారులు విజేతగా నిలిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా నెట్‌వర్క్ కంపెనీగా జియో నిలిచింది.
భారతదేశంలోనూ ఈ స్థానాన్ని సహజంగానే కైవసం చేసుకుంది. ఏప్రిల్ 2019 ట్రాయ్ గణాంకాల ప్రకారం, 314.8 మిలియన్ల చందాదారులను జియో కలిగి ఉంది. జియో నెట్‌వర్క్ పరిధి విశేషంగా పెంచుకున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రతి ఇంటిని చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వారందరికీ జియో డిజిటల్ లైఫ్ ప్రయోజనాలు అందించాలని ఆకాంక్షిస్తోంది. ఆయా ప్రయోజనాలు ఇవి.
1. జియో వినియోగదారులందరికీ సాటిలేని కనెక్టివిటీ సౌలభ్యం. 4జీ నెట్‌వర్క్ యొక్క శక్తివంతమైన మరియు విస్తృత శ్రేణి నెట్‌వర్క్‌తో ఉత్తమ సేవలు.
2. జియో యొక్క అన్‌లిమిటెడ్ వాయిస్, డేటా ప్రయోజనాలు
3. జియో ప్రీమియం యాప్స్ యొక్క ప్రయోజనాలు పొందే అవకాశం, జియో టీవీ (అత్యంత జనాదరణ పొందిన క్యాచ్ ఆప్ టీవీ యాప్), జియో మ్యూజిక్, జియో సినిమా సహా మరెన్నింటినో ఆనందించవచ్చు.
4. జియో సిమ్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచడం.