భారత మార్కెట్‌లోకి హెచ్‌టీసీ 10 స్మార్ట్‌ఫోన్‌.. ధర రూ.52,990

గురువారం, 26 మే 2016 (16:07 IST)
స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీల్లో అగ్రగామిగా ఉన్న హెచ్‌టీసీ కంపెనీ ప్రతి ఒక్కరూ అమితాసక్తితో ఎదురు చూస్తున్న 4జీ స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ 10ను భారత మొబైల్ మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ ఫోను ప్రీమియం ధర రూ.52,990గా నిర్ణయించారు.
 
5.2 అంగుళాల హెచ్‌టీసీ 10 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రొసెస్సర్‌, 2.2 జీహెచ్‌జడ్ కంప్యూటిగ్ స్పీడ్‌, 32 జీబీ ఇంటర్నెల్, 2 టెర్రాబైట్స్ ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌ను టెక్నాలజీని కలిగివుంది. అలాగే, అత్యాధునిక వైర్‌లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ, ఎన్ఎఫ్‌సీ టు డీఎల్‌ఎన్ఏ, మిరాకాస్ట్, 50 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్, 450 ఎంపీబీసీ డౌన్‌లోడ్ స్పీడ్, 4జీ నెట్‌వర్క్‌ను దీని సొంతం. 
 
ఇందులో మల్టిపుల్ సెన్సార్లను అమర్చారు. ఇది గెస్టర్ కంట్రోల్, వాయిస్ సెల్ఫీ, మోషన్ డిటెక్షన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అలాగే, 3జీ లేదా 4జీ నెట్‌వర్క్‌లో 27 గంటల టాక్ టైమ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ (31 శాటిలైన్ నెట్‌వర్క్), గ్లోనాస్ (24 శాటిలైట్ నెట్‌వర్క్), చెనా టెక్నాలజీ బీడియులకు ఇది సపోర్ట్ చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి