2జీ కాలంలో దేశం ఓ దశాబ్దం వెనకబడింది... 6జీ సేవలు వచ్చేస్తున్నాయ్!

బుధవారం, 18 మే 2022 (17:34 IST)
2జీ కాలంలో అవినీతి వల్ల దేశం ఓ దశాబ్దం వెనకబడిందని పరోక్షంగా కాంగ్రెస్​ను విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. ట్రాయ్​ సిల్వర్​ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక 3జీ నుంచి దేశాన్ని 4జీలోకి నడిపించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు 5జీ లోకి అడుగుపెట్టామని, ఇది దేశాన్ని అభివృద్ధిబాటలో పరుగులు పెట్టిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
 
పరిపాలనలో కూడా 5జీ టెక్నాలజీ మంచి మార్పులు తీసుకొస్తుందని, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితర రంగాల అభివృద్ధికి తోడ్పడుతుందని మోడీ వివరించారు. 5జీ టెక్నాలజీతో దేశ ఆర్థిక వ్యవస్థకు 45 వేల కోట్ల డాలర్ల సహకారం అందుతుందని ప్రధాని తెలిపారు. 
 
ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ సేవలు ప్రారంభించాలని కోరుకుంటున్నామని, ఇప్పటికే దానికోసం ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​పాల్గొన్నారు. ట్రాయ్​ సిల్వర్​ జూబ్లీ వేడుకల్లో భాగంగా పోస్టల్​ స్టాంప్​ను విడుదల చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు