భారత్‌లో లభించే డివైజ్‌లతోనే ఈ టెక్నాలజీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే ఇండియాకు 6జీ వస్తోందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోనంతగా డెవలప్ చేస్తున్నామని మంత్రి అశ్విని వెల్లడించారు. 2023 చివరిలో లేదా 2024 ఏడాది ప్రారంభంలో స్వదేశీ 6G సిస్టమ్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. వచ్చే ఏడాదిలోనే 5G టెక్నాలజీ కూడా లాంచ్ చేయనున్నారు
వచ్చే ఏడాది మార్చి తర్వాత 5జీ టెక్నాలజీ వచ్చే అవకాశం వుందన్నారు. 5G స్పెక్ట్రమ్ వేలం గురించి కూడా అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇచ్చారు. ఇప్పటికే ట్రాయ్ పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. ప్రెజెంటేషన్ స్లైడ్ విషయంలో 6జీ వేగం.. 5జీ కంటే 50 రెట్లు ఎక్కువగా ఉందని శాంసంగ్ పేర్కొంది. ఇప్పటికే దీనిపై సంస్థ శ్వేత పత్రం కూడా విడుదల చేసింది.