జూన్ నెల ప్రారంభంలో ఈ ఫోన్ గూగుల్ కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఇందులో హెచ్‌డీడిస్ ప్లేను అందించనున్నారు. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3జీబీ ర్యామ్ ఇందులో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి ఎక్కువ వివరాలు తెలియరాలేదు.
ఇన్‌ఫీనిక్స్ సంస్థకు చెందిన ఫేస్ బుక్, ట్వీటర్ పేజీల్లో మాత్రం ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ అనే పేరును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ బ్యానర్‌లో జులై 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అని పేర్కొన్నారు. అయితే దీని బ్యాటరీ మాత్రం చాలా పెద్దది అని సూచించేలాగా #FullPower24Hr అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించారు.