రిలయన్స్ జియోలో మరో భారీ పెట్టుబడి పెట్టింది.. ఇంటెల్ సంస్థ. వరుస పెట్టుబడులతో రికార్డు క్రియేట్ చేస్తున్న ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌కు చెందిన టెలికాం విభాగం జియో ఫ్లాట్‌ఫామ్‌లలో 0.39 శాతం ఈక్విటీ వాటా ఇంటెల్ క్యాపిటల్‌కు దక్కనుంది. తద్వారా జియో ప్లాట్‌ఫామ్‌లలో ఇంటెల్ క్యాపిటల్ 1,894.50 కోట్లు రూపాయల పెట్టుబడి పెట్టినట్లైంది.
ప్రపంచవ్యాప్తంగా వినూత్న సంస్థలలో పెట్టుబడులు పెట్టడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5జీ వంటి అంశాలపై దృష్టి సారించామని ఇంటెల్ క్యాపిటల్ తెలిపింది.