భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో తయారీ యూనిట్

సెల్వి

మంగళవారం, 20 ఆగస్టు 2024 (16:08 IST)
రాబోయే ఐఫోన్ 16 ప్రోతో ప్రారంభించి, ఆపిల్ తన ప్రో ఐఫోన్ మోడళ్లను భారతదేశంలో మొదటిసారిగా తయారు చేయడం ద్వారా చారిత్రాత్మక చర్యను చేపట్టనుంది. 
 
యాపిల్ 2017లో iPhone ఎస్ఈతో తన భారతీయ జర్నీని ప్రారంభించింది. క్రమంగా ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, అలాగే ఐఫోన్ 15, ప్రస్తుతం ఐఫోన్ 14 ప్లస్ కూడా భారత మార్కెట్లోకి వచ్చాయి. ఇంకా ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు పెద్ద బ్యాటరీ, టైటానియం ఫ్రేమ్, మెరుగైన కెమెరాతో వస్తాయి.
 
తాజాగా ఐఫోన్ 16 ప్రోను భారతదేశంలో తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. 2023 నాటికి, భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఐఫోన్ 15 యూనిట్లు ప్రపంచ విక్రయాల మొదటి రోజున అందుబాటులోకి వచ్చాయి.
 
ఇంతలో, పెగాట్రాన్ ఇండియా యూనిట్, టాటా గ్రూప్ వంటి దేశంలోని ఇతర ఆపిల్ భాగస్వాములు కూడా భారతదేశంలో iPhone 16 Pro, iPhone 16 Pro Max మోడళ్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభిస్తారని నివేదించబడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు