ఆపిల్ సంస్థకు చెందిన కొత్త మోడల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను వెయ్యి అడుగుల ఎత్తు నుంచి కిందకి పడేశారు. 1000 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడేసిన ఫోన్ ఏమైందో తెలియజేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్‌లాక్ రివర్ అనే సంస్థ కొత్తగా విడుదల చేసే స్మార్ట్ ఫోన్లను పరిశోధించడాన్ని పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొత్తగా విడుదలైన ఆపిల్ ఎక్స్ స్మార్ట్ ఫోనును పరిశోధించింది.
దీనికి సంబంధించిన వీడియోను కూడా నెట్లో పోస్టు చేసింది. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది. డ్రోన్ కెమెరా ద్వారా ఐఫోన్ ఎక్స్ స్మార్ట్ ఫోనును కట్టి.. వంద అడుగుల ఎత్తును నుంచి కిందకి పడేయడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ నేరుగా కాంక్రీట్ నేలను తాకింది. ఫోను వెనుక భాగం నుజ్జు నుజ్జు అయినప్పటికీ.. ఆ ఫోన్ పని చేస్తుంది. వీడియోను లుక్కేయండి. ఇప్పటివరకు ఈ వీడియోను 822,197 మంది వీక్షించారు.