ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో కొత్త కొత్త ప్లాన్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గత 2017వ సంవత్సరం రిలయన్స్ చీఫ్ ముకేష్ అంబానీ.. ఉచిత డేటాను అందించిన సంగతి తెలిసిందే. ఈ డేటా కోసం వొడాఫోన్, ఎయిర్‌టెల్ కస్టమర్లు కూడా జియోకు మారిపోయారు. దీంతో జియోకు పోటీగా ఇతర టెలికాం సంస్థలన్నీ డేటాతో ధరను తగ్గించాయి.