కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇచ్చాయి. దీంతో డేటా డిమాండ్ పెరిగింది. దీంతో టెలికం కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు పోటీలు పడుతున్నాయి. బెస్ట్ డేటా ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు డేటా ప్లాన్లు విడుదలు చేస్తున్నాయి. తాజాగా దిగ్గజ టెలికం కంపెనీ జియో.. తన కస్టమర్ల కోసం కొత్త డేటా ప్లాన్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిని ఉద్దేశించి ఈ ప్లాన్లు తీసుకొచ్చింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా డేటా అవసరం అవుతోంది. అయితే తక్కువ డబ్బుకే ఎక్కువ డేటా, వాలిడిటీ ఇచ్చే టెలికం కంపెనీల వైపు కస్టమర్లు చూస్తున్నారు. తాజాగా రిలయన్స్ జియో సైతం అలాంటి డేటా ప్లాన్లు తీసుకొచ్చింది.
* ఇతర హోమ్ ప్లాన్స్ లాగానే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, ఇతర యాప్ లను యాక్సెస్ చేయడం వంటి ప్రయోజనాలు ఉండవు