ఇక ఇప్పుడు అసలైన పోరు మొదలైనట్లే. ఎందుకంటే ఇప్పటివరకూ వాయిస్ చార్జెస్, డేటా చార్జెస్ పేరుతో ఇతర కంపెనీలు వసూలు చేస్తున్న మొత్తాలకు గండి పడినట్లే. ఇప్పటికే జియో ఉచిత ఆఫర్లు ప్రకటించిన సమయంలో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా తదితర కంపెనీలు ట్రాయ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో ఈ కంపెనీలపై పిడుగులా మరో వార్త... జియో ఉచిత ఫోన్. అది కూడా 22 భాషల సౌలభ్యత. ఈ ఫోన్ దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్ తదితర కంపెనీలకు భారీ కుదుపు తప్పేలా లేదు. మరి ఆ కంపెనీలు అంబానీ సునామీని ఎలా తట్టుకుని నిలబడతాయో వేచి చూడాల్సిందే.