#జియో ఫోన్ లైట్ రూ. 400.. జియో క్రేజ్ అలా జరిగినా తగ్గలేదు..

మంగళవారం, 31 డిశెంబరు 2019 (13:14 IST)
రిలయన్స్ జియో వినియోగదారులను పెంచుకుంటూ పోతోంది. అక్టోబర్‌లో రిలయెన్స్ జియో 91 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. దీంతో రిలయెన్స్ జియో యూజర్ బేస్ 36.43 కోట్లకు చేరుకుందని ట్రాయ్ చెప్తోంది. రిలయెన్స్ జియో ఐయూసీ ఛార్జీలను ప్రకటించినా యూజర్ల నుంచి ఆదరణ తగ్గలేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. నిమిషానికి 6 పైసల చొప్పున ఐయూసీ ఛార్జీలను రిలయెన్స్ జియో అక్టోబర్‌లోనే ప్రకటించింది. 
 
అదే నెలలో జియో యూజర్ల సంఖ్య భారీగా పెరగడం విశేషం. అక్టోబర్ లెక్కల ప్రకారం రిలయెన్స్ జియో మార్కెట్ షేర్ 30.79%. ఆంధ్రప్రదేశ్‌, కోల్‌కతా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్ సర్కిళ్లలో రిలయెన్స్ జియో టాప్‌లో నిలిచింది.
 
ఇకపోతే.. జియో నుంచి కొత్త ఫీచర్ ఫోన్ రానుంది. మునుపటి ఫోన్లు అంటే జియోఫోన్, జియోఫోన్ 2 ప్రధానంగా ఇంటర్నెట్ కోసం ప్రారంభించబడ్డాయి. ఈ రెండు ఫోన్లను కంపెనీ కేవలం 4జీ నెట్‌‌వర్క్‌‌లో లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం జియో తీసుకురానున్న ఫీచర్ ఫోన్ మాత్రం ప్రత్యేకంగా కాలింగ్ కోసమేనని తెలుస్తోంది. నెట్లో వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ ఫోనును జియోఫోన్ లైట్ అని పిలవవచ్చని టాక్. 
 
ఈ ఫీచర్ ఫోన్ ధర జియోఫోన్ లైట్ రూ. 400-రూ.500 ధరల మధ్య లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ, వాస్తవానికి దీని ధర 399 రూపాయలని, ఇది 50 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌తో రాబోతోందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు