రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ జియో నెక్స్ట్ పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల 2జీ వినియోగదారులే లక్ష్యంగా మార్కెట్లోకి జియోఫోన్ నెక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ వస్తున్నది. కాగా, భారతీయుల కోసం భారతదేశంలో భారతీయులే ఈ ఫోనును తయారు చేయడం గమనార్హం. ఈ ఫోన్ కోసం జియో ప్లాట్‌ఫామ్స్, గూగుల్ సంయుక్తంగా ఓ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను అభివృద్ధి చేశాయి. ప్రగతి ఓఎస్ పేరుతో ఈ టెక్నాలజీ వ్యవస్థను తీసుకొచ్చాయి.
స్క్రీన్‌పై ఏ యాప్ నుంచి తెరుచుకున్న విషయాన్నైనా మొబైల్ వినియోగదారుడు వినేలా రీడ్-అలౌడ్ ఫంక్షన్‌ను జియోఫోన్ నెక్స్‌లో పెట్టినట్లు ఫోన్ తయారీ, సరఫరాదారు అశోక్ అగర్వాల్ చెప్పారు. ఇందులో క్వాల్‌కామ్ ప్రాసెసర్ ఉండగా, తిరుపతి-శ్రీపెరంబుదూర్‌లోగల రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ నియోలింక్ కేంద్రంలో ఫోన్ తయారవుతుంది.