లావా బ్లేజ్ ఒక ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ డిజైన్ పరంగా ఈ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే, ఇందులో అత్యాధునిక ఫీచర్లను అందుబాటులో ఉంచారు. దీని వెనుక ప్యానెల్ గ్లాస్ బ్యాక్‌తో వచ్చింది. మరోవైపు, మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ స్కాన్, ట్రిపుల్ కెమెరా ఇమేజింగ్ సిస్టమ్‌ను అమర్చారు.
ఈ లావా బ్లేజ్ ఫోనులోని స్మార్ట్ ఫీచర్లను పరిశీలిస్తే...
* 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపీఎస్ ఎల్డీసీ డిస్‌ప్లే.
* 3జీబీ ర్యామ్, 64 జీపీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం.
* మీడియా టెక్ హెలియో ఏ22 ప్రాసెసర్.
* వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 2ఎక్స్ 0.2 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ షూటర్.
* ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్.
5* 000 ఎంహెచ్ఏ బ్యాటరీ సామర్థ్యం, 10డబ్ల్యూ ఛార్జర్.