Motorola X30 Pro.. స్పెసిఫికేషన్స్.. 6.67 అంగుళాల OLED ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే

సోమవారం, 8 ఆగస్టు 2022 (12:31 IST)
Moto X30 Pro
ఆగస్టు 15న మోటరోలా ఈవెంట్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా 200 మెగాపిక్స్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేయనుంది. కెమెరా కాన్ఫిగరేషన్ గురించిన సమాచారాన్ని కంపెనీ స్వయంగా పంచుకుంది. Motorola Moto X30 Pro, Moto S30 Pro, Moto Razr 2022 అనే మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేసింది. ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్ TINA సర్టిఫికేషన్‌లో గుర్తించబడింది.
 
Motorola X30 Pro 200-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుందని, దీనిని Apchi 1 ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో Samsung అందజేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు ఇందులో ఈ కెమెరా 8K వీడియోను రికార్డ్ చేయగలదు.
 
ప్రైమరీ కెమెరాతో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కనిపిస్తుంది. ఇది 117 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూని క్యాప్చర్ చేయగలదు. అలాగే ఇది 2.5 సెం.మీ ఫోకల్ లెంగ్త్‌తో వస్తుంది. ఇది 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కూడా పొందుతుంది. సెల్ఫీ కోసం 60 మెగాపిక్సెల్ వెనుక కెమెరా అందుబాటులో ఉంటుంది.
 
Motorola X30 Pro స్పెసిఫికేషన్‌ను పరశీలిస్తే.. ఇది 6.67 అంగుళాల OLED ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో, 144 Hz రిఫ్రెష్ రేట్లు కనిపిస్తాయి. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఉంటుంది. ఇది 4550 mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ 125 వాట్ల ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు