పేటీఎం తన యాప్‌లో కొత్త సేవను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా దేశ, విదేశాల్లో సులభంగా హోటళ్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను సులభతరం చేయడానికి, పేటీఎం బ్రాండ్ కింద పనిచేసే One97 కమ్యూనికేషన్స్ డిజిటల్, ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ Agodaతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం పేటీఎం యాప్ ద్వారా భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా హోటల్ బుకింగ్‌లను అనుమతిస్తుంది. పేటీఎం ట్రావెల్ ఇప్పటికే విమానాలు, రైళ్లు, బస్సులకు బుకింగ్ సేవలను అందిస్తుంది.