ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం.. పోకో ఎం3 ప్రోలో 22W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎంఐయూఐ 12, బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే దీనిలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్ ప్లే ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో పాటు చైనాలో రెడ్‌మీ 20 ఎక్స్‌గా ఈ ఫోన్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా, ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో విడుదల కానున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.