భారతదేశంలో అసుస్ జెన్‌బుక్ డ్యూయల్ స్ర్కీన్ ల్యాప్‌టాప్స్ నూతన ఎడిషన్
గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:50 IST)
తైవనీస్ టెక్నాలజీ అగ్రగామి సంస్థ అసుస్. తమ తాజా ఎడిషన్స్- జెన్‌బుక్ డ్యూయో 14 మరియు జెన్‌బుక్ ప్రో డ్యూయో 15 ఓఎల్‌ఈడీని తమ విస్తృతశ్రేణి జెన్‌బుక్ శ్రేణికి జోడించింది. ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో వీటిని ఆవిష్కరించారు. ల్యాప్‌టాప్స్ ఆఫ్ టుమారో జెన్‌బుక్ ప్రో డ్యూయెఓ 15 ఓఎల్‌ఈడీ మరియు జెన్‌బుక్ డ్యూయో 14 లు డ్యూయల్ డిస్‌ప్లేను నాలుగు వైపులా ఫ్రేమ్‌లెస్ నానో ఎడ్జ్ డిస్‌ప్లేతో ప్రదర్శిస్తున్నారు. అసాధారణ బ్రైట్‌నెస్ కలిగి ఉండటంతో పాటుగా పూర్తిగా లీనమయ్యే అనుభవాల కోసం అలా్ట్ర స్లిమ్ బీజెల్స్ సైతం కలిగి ఉన్నాయి.
అసుస్ యొక్క తాజా ఆఫరింగ్స్ తమ వినియోగదారులను తమ సరిహద్దులకు ఆవల చూడాల్సిందిగా ప్రోత్సహించడంతో పాటుగా అసుస్ డ్యూయల్ స్ర్కీన్ ల్యాప్‌టాప్స్ లాగా ఔట్ ఆఫ్ లైన్‌తో జీవించమని ప్రోత్సహిస్తుంది. తమ నేపథ్యం బీ బోల్డ్.బీ క్రేజీ. బీ అన్‌బయాస్డ్‌కు అనుగుణంగా ఈ నూతనంగా ఆవిష్కరించిన ల్యాప్‌టాప్‌లు ల్యాప్‌టాప్ యొక్క పోర్టబిలిటీ పరంగా ఎలాంటి రాజీపడకుండా అత్యుత్తమతను అందిస్తూనే క్రియేటర్లకు అత్యంత అనుకూలమైన మరియు బహుళ డిస్‌ప్లేలపై పనిచేయడాన్ని అమితంగా ఇష్టపడే ప్రజలను ఆకట్టుకుంటుంది.
జెన్‌బుక్ డ్యూయో 14(యుఎక్స్482ఈఏ)లో ఇంటెల్ ఇవో ధృవీకృత మరియు ఫీచర్లు 11వ తరపు ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో ఇంటెల్ ఐరీస్ ఎక్స్ గ్రాఫిక్స్‌తో ఉంటాయి. నివిడియా జీఫోర్స్ ఎంఎక్స్450 జీపీయుతో ఇది వస్తుంది. జెన్‌బుక్ డ్యూయోలో 14 అంగుళాల ఎల్‌ఈడీ బ్లాక్‌లిట్ ఫుల్‌హెచ్‌డీ 1080 పిక్సెల్ డిస్‌ప్లే 100% ఎస్‌ఆర్‌జీబీ కవరేజీతో ఉంటుంది.
ఈ డ్యూయల్ స్ర్కీన్‌తో పాటుగా జెన్‌బుక్ ప్రో డ్యూయో 15 ఓఎల్‌ఈడీ, తగినంత శక్తిని మించి అందిస్తుంది. ఇది ఎలాంటి రాజీపడకుండా రెండు డిస్‌ప్లేలను అందిస్తుంది. జెన్‌బుక్ ప్రో డ్యూయో లో 10వ తరపు ఇంటెల్ కోర్ ఐ9 ప్రాసెసర్‌తో పాటుగా నివిడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 3070 మరియు 32జీబీ డీడీఆర్4రామ్ ఉంటాయి.
ఈ నూతన ఉపకరణాలను గురించి శ్రీ అర్నాల్డ్ సు, బిజినెస్ హెడ్, కన్స్యూమర్ అండ్ గేమింగ్ పీసీ, సిస్టమ్ బిజినెస్ గ్రూప్, అసుస్ ఇండియా మాట్లాడుతూ అసుస్ వద్ద మా లక్ష్యమెప్పుడూ కూడా ఆవిష్కరణలకు పరిమితి విధించుకోకుండా వినియోగదారుల అంచనాలను మించిన ఉత్పత్తులను అందించడం. అసుస్ జెన్‌బుక్ ప్రో డ్యూయో 15 ఓఎల్‌ఈడీ మరియు జెన్‌బుక్ డ్యూయో 14లు దీనికి మరో నిదర్శనం.
ఈ ల్యాప్‌టాప్‌ల పనితీరు వీటిని రేపటి తరపు ల్యాప్‌టాప్‌లుగా మారుస్తుంది. అదనపు స్ర్కీన్ ఎప్పుడూ కూడా ఉత్పాదకతకు అనువుగా పనిచేస్తుంటుంది. అది బహుళ చిత్రాలు లేదా బహుళ ట్యాబ్‌లు అయినా కావొచ్చు. డెస్క్‌టాప్‌కు అదనపు స్ర్కీన్ జోడించుకోవడం సులభమేకావొచ్చు కానీ దానినే ల్యాప్‌టాప్‌పై చేస్తే పోర్టబిలిటీ అవకాశాలూ లభిస్తాయి. మా జెన్‌బుక్‌కు నూతన జోడింపులు సెకండ్ స్ర్కీన్‌తో ఈ సమస్యకు తగిన పరిష్కారం అందిస్తూనే, ల్యాప్‌టాప్‌ను ఉత్పాదకత పరంగా అసాధారణంగా మారుస్తుంది. భారతీయ మార్కెట్‌లో ఈ ఉత్పత్తిని విడుదల చేయడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. మా వినియోగదారులు సరిహద్దులను ముందుకు తోయడంతో పాటుగా లివ్ ఔట్ ఆఫ్ లైన్ అని ప్రోత్సహిస్తున్నాం అని అన్నారు.
రాహుల్ మల్హొత్రా, డైరెక్టర్- కన్స్యూమర్ సేల్స్, ఇంటెల్ ఇండియా మాట్లాడుతూ, పీసీ పర్యావరణ వ్యవస్థతో కలిసి పనిచేయడానికి ఇంటెల్ కట్టుబడి ఉంది. ఇది సౌకర్యవంతమైన, అవరోధాలు లేని అనుభవాలను వినియోగదారులకు అందించడంతో పాటుగా శక్తివంతమైన పనితీరు, బ్యాటరీ జీవితం, స్పందన మరియు కనెక్టివిటీని అందిస్తుంది. 11వ తరం ఇంటెల్ కోర్‌లో ఇంటెల్ ఇవో ధృవీకృత డిజైన్లు ఉన్నాయి. అత్యవసరమైన అంశాలను మరింతగా చేసేందుకు ఇది తోడ్పడటంతో పాటుగా ఎక్కడైనా సరే అసాధారణ మొబైల్ అనుభవాలనూ అందించనుంది అని అన్నారు.
క్లిష్టత లేని డ్యూయల్ డిస్‌ప్లే
ఈ ల్యాప్‌టాప్‌లలో నూతన టిల్టింగ్ స్ర్కీన్ ప్యాడ్ ప్లస్, సెకండరీ టచ్ స్ర్కీన్ ఉన్నాయి. ఇవి స్వయంచాలకంగా 9.5 డిగ్రీల కోణంలో టిల్ట్ చేయడంతో పాటుగా జెన్‌బుక్ ప్రో డ్యూయో 15 ఓఎల్‌ఈడీ కోసం మరియు జెన్‌బుక్ డ్యూయో 14 కోసం7 డిగ్రీల వరకూ టిల్ట్ చేస్తుంది. ఇది గ్లేర్ తగ్గించడంతో పాటుగా రిఫ్లెక్ష న్‌ను తగ్గించి మెరుగైన రీడబిలిటీ అందిస్తుంది. ఈ రెండు డిస్‌ప్లేలలోనూ ఎలాంటి క్లిష్టత లేనివిజువల్స్‌ను ఒకరు ఆస్వాదించవచ్చు. స్ర్కీన్ ప్యాడ్ ప్లస్ ఆప్టిమైజ్డ్ యాప్స్‌తో అతి సులభమైన మల్టీ టాస్కింగ్ సైతం సాధ్యమవుతుంది.
నాలుగు వైపులా ఫ్రేమ్‌లెస్ నానో ఎడ్జ్ ఓఎల్‌ఈడీ 4కె డిస్‌ప్లేతో పాటుగా నూతన జెన్‌బుక్ ప్రో డ్యూయో 15 ఓఎల్‌ఈడీ సైతం అలా్ట్ర స్లిమ్ బీజెల్స్‌ను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు సంపూర్ణమైన అనుభవాలను అందిస్తుంది. ఈ రెండు ల్యాప్‌టాప్‌లూ పాంటోన్ వాలిడేటెడ్ డిస్‌ప్లేను ప్రొఫెషనల్ గ్రేడ్ కలర్ ఖచ్చితత్త్వం కోసం కలిగి ఉంది. అతి తక్కువ బ్లూ లైట్ ఉద్గారాల కోసం టీయువీ రీల్యాండ్ సర్టిఫికేషన్ అందుకుంది. ఇది సుదీర్ఘమైన సృజనాత్మక సదస్సులో సైతం వినియోగించేందుకు అనువుగా మారుస్తుంది.
స్ర్కీన్‌ప్యాడ్ ప్లస్
ఆధునీకరించిన సెకండరీ డిస్‌ప్లేను అసుస్ స్ర్కీన్‌ప్యాడ్ ప్లస్ అంటున్నారు. నూతన స్ర్కీన్‌ఎక్స్‌పర్ట్2 సాఫ్ట్‌వేర్‌ను ఇది ప్రదర్శిస్తుంది. ఈ నూతన కంట్రోల్ ప్యానెల్ యాప్, వినియోగదారులు తమ ఉత్పాదకతను బిల్ట్ ఇన్ యాప్స్ ద్వారా వేగవంతం చేసుకునేందుకు తోడ్పడటంతో పాటుగా తమ వర్క్‌ఫ్లోకు తగినట్లుగా అనుకూలీకరించుకునే అవకాశమూ అందిస్తుంది. కంపాటిబల్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తున్నప్పుడు ఈ కంట్రోల్ ప్యానెల్ యాప్, వినియోగదారులు తమ బ్రష్ సైజ్, శాచురేషన్, లేయర్ ఓపాసిటీ మార్చుకోవడం మరియు మరెన్నో చేసేందుకు తోడ్పడుతుంది.
వినియోగదారులు డయల్, బటన్, స్లైడర్ మరియు స్ర్కోల్ నుంచి ఎంచుకోవచ్చు. ప్రతి కంట్రోల్‌ను వినూత్నమైన రీతిలో క్రియేటివ్ వర్క్‌ఫ్లోకు అనువుగా తీర్చిదిద్దారు. కంట్రోల్ ప్యానెల్, పూర్తి కస్టమైజబుల్ కావడంతో పాటుగా అడోబ్ ఫోటోషాప్, లైట్‌రూమ్ క్లాసిక్, ప్రీమియర్ ప్రో మరియు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌కు అనుకూలీకరించబడింది. స్ర్కీన్‌ఎక్స్‌పర్ట్ యాప్ ఇప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌గా లభ్యమవుతుంది. త్వరలోనేమరిన్ని అనుకూలమైన యాప్స్ విడుదల చేయగలమని నమ్ముతున్నాం.
ప్రయాణ సమయాల్లోనూ వృద్ధి చేయబడిన ఉత్పాదకత:
జెన్‌బుక్ ప్రో డ్యూయో 15 ఓఎల్‌ఈడీ 22 మిల్లీమీటర్ల లోపు ఉండటంతో పాటుగా 2.35 కేజీల బరువు కలిగి ఉంటుంది. గత తరంతో పోలిస్తే 2.5 మిల్లీమీటర్ జెడ్ హైట్ కలిగి ఉంటుంది. ఇది టిల్టింగ్ స్ర్కీన్ ప్యాడ్ ప్లస్ డిజైన్‌తో సాధ్యమవుతుంది. ఇది ఇంటర్నల్స్‌ను రీఎరేంజ్ చేయడానికి సవాల్ విసురుతుంది. బ్యాటరీ జీవితకాలం సైతం గణనీయంగా 29.5% వృద్ధి చేయబడింది. దీనిని పునరుద్ధరించబడి బ్యాటరీ డిజైన్ కారణం. అంతేకాదు, ప్రిసిషన్ ఇంజినీర్డ్ ఎర్గో లిఫ్ట్ హింజ్ , కీ బోర్డ్‌ను నాలుగు డిగ్రీలు పైకి తిప్పేందుకు అనుమతిస్తుంది. ఇది అలసట లేని టైపింగ్ అందించడంతో పాటుగా ఎయిర్‌ఫ్లోను మరింతగా వృద్ధి చేస్తుంది. అదే సమయంలో మొత్తంమ్మీద ఆడియో అనుభవాలనూ మెరుగుపరుస్తుంది.
ఇవాల్డ్వ్ కూలింగ్
జెన్‌బుక్ డ్యూయో 14 మరియు జెన్‌బుక్ ప్రో డ్యూయో 15 ఓల్‌ఈడీలు వినూత్నమైన యాక్టివ్ ఏరోడైనమిక్ సిస్టమ్ (ఏఏఎస్+)తో శక్తివంతం చేయబడ్డాయి. ఇది స్ర్కీన్‌ప్యాడ్ ప్లస్‌పు కూలింగ్ వ్యవస్థలో అంతర్భాగంగా మారుస్తుంది. ల్యాప్‌టాప్ లిడ్ తెరుచుకోగానే, సెకండరీ డిస్‌ప్లే సైతం ఎదుగుతుంది. ఇది అత్యుత్తమ వీక్షణను సైతం అందిస్తుంది. అదే సమయంలో 49%కు అత్యధిక ఎయిర్‌ఫ్లోను సైతం తీసుకుంటుంది. అదే సమయంలో, ఈ ల్యాప్‌టాప్ డెస్క్ నుంచి బాటమ్ ఛాసిస్‌కు పైకి లేపుతుంది. నూతన ఏఏఎస్ ప్లస్ డిజైన్, పనితీరు పరంగా మెరుగైన ప్రదర్శన కోరుకునే మల్టీటాస్కర్లుకు అవసరమైన పనితీరు కొనసాగించడానికి మరియు లైట్ కంటెంట్ క్రియేషన్ వర్క్‌ఫ్లో కొనసాగించడానికి తోడ్పడుతుంది.