షార్క్ ట్యాంక్ నిధులను సమకూర్చిన, విద్యార్థులు మరియు అభ్యాసకుల కోసం ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత ల్యాప్‌టాప్ తయారీ బ్రాండ్ ప్రైమ్ బుక్ ఇటీవలనే ప్రైమ్‌బుక్ 4జీని విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్‌లో గణనీయమైన ప్రభావం చూపింది. ప్రైమ్ బుక్ ఇప్పటికే 20వేల రూపాయల లోపు అగ్రగామి ల్యాప్‌టాప్‌లలో ఒకటిగా ఖ్యాతి గడించింది. గణనీయమైన సంఖ్యలో ఈ ల్యాప్‌టాప్‌కు ముందస్తు ఆర్డర్లు జరగడం,ఈ నూతన మోడల్‌ను సాదరంగా భారతీయ మార్కెట్ స్వాగతిస్తుందనేదానికి సంకేతాలనిస్తుంది.
ప్రైమ్‌బుక్ 4జీలో 4జీ వైర్‌లెస్ సిమ్ కనెక్టివిటీ ఉంది. ఇది ప్రైమ్ ఓఎస్‌పై నడుస్తుంది. ఈ బ్రాండ్ యొక్క వినూత్న ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11 ఆధారితం. దాదాపు 200కు పైగా అభ్యాస, విద్యా కేంద్రీకృత అప్లికేషన్‌లను పరిశీలించడం వల్ల ఇది పలు ఆండ్రాయిడ్ యాప్స్‌ను ప్రైమ్ స్టోర్ ద్వారా పొందే అవకాశం అందిస్తుంది. అదనంగా, ఈ ల్యాప్‌టాప్ యొక్క మల్టీ విండో ఫీచర్, మరింత ఉత్పాదక అనుభవాలను మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ కంటే మిన్నగా అందిస్తుంది. దీనిలో మీడియా టెక్ ప్రాసెసర్ ఉండటంతో పాటుగా 64జీబీ స్టోరేజీ(200జీబీ వరకూ విస్తరించవచ్చు) ఉంటాయి. ప్రైమ్‌బుక్ 4జీ ధర 16,990 రూపాయలు. ప్రైమ్‌బుక్ 4జీని రాయితీ ధరలో ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు 14,990 రూపాయలకు అందిస్తున్నారు.