ఈ సొసైటీలో దేశ వ్యాప్తంగా ఉన్న వెయ్యి పత్రికలు నమోదై ఉన్నాయి. వేలాది మంది జర్నలిస్టులకు జీతాలు చెల్లిస్తూ సేకరిస్తున్న వార్తలను గూగుల్ వాడేసుకుంటుంది. అందుకుగానూ.. తమకు పరిహారం ఇవ్వాలని సొసైటీ క్లియర్‌గా చెప్పేసింది. కొద్ది రోజుల ముందే న్యూస్ వాడుకుంటున్నందుకు డబ్బులు చెల్లించాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది.
ఈ మధ్యే ఫ్రాన్స్, యురోపియన్ యూనియన్, ఆస్ట్రేలియాలోనూ పరిహారం చెల్లించడానికి గూగుల్ అంగీకరించిందని కూడా తెలిపింది. పత్రికలు ప్రధానంగా యాడ్స్‌పైనే ఆధారపడతాయని, డిజిటల్ స్పేస్‌లో మాత్రం మెజార్టీ వాటాను గూగుల్ తీసేసుకుని తమను నష్టానికి గురిచేస్తుందని ఆరోపించారు.