భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గూగుల్ పే, అమేజాన్ పేలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. గూగుల్ పే, అమేజాన్ పే వంటి సంస్థలు విదేశాల్లో వుండే సర్వర్‌ల ద్వారానే భారతీయ నగదు బదిలీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది.
ఇంకా భారత దేశంలో సర్వర్లు లేని గూగుల్ పే, అమేజాన్ పే వంటి సంస్థలు త్వరలో వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఈ వ్యవహారంపై గూగుల్ పే, అమేజాన్ పే సంస్థలు 24 గంటల్లోపు నిర్ణయం తీసుకుని వివరణ ఇవ్వాలని ఆర్బీఐ అల్టిమేటం జారీ చేసింది.