భారత మార్కెట్లోకి రియల్ మి కొత్త ఉత్పత్తులు.. ఏంటవి?

ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (16:37 IST)
చైనాకు చెందిన రియల్‌మి భారత్ మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను తీసుకురాబోతోంది. వివిధ రకాల స్మార్ట్‌టీవీలతో పాటు ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ సహా అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈవో మాధవ్‌ సేథ్‌ తెలిపారు.
 
రియల్‌మీ- బ్రాండెడ్‌ ఐఓటి పరికరాలతో పాటు, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు మాధన్ సేథ్ వెల్లడించారు. రియల్‌మి స్మార్ట్‌టీవీలు, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లు సహ అనేక ఉత్పత్తులు విడుదల చేస్తామని తెలిపారు.
 
ఇందులో భాగంగా 2020లోనే స్మార్ట్ టీవీలను 2వ క్వార్టర్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్‌ నెలలో కూడా అవకాశం ఉందని మాధన్ సేథ్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు