తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల 45 మంది ఉక్రెనియా వాసులు, 27 మంది విదేశీయులు వుహాన్ నుంచి ఖార్కివ్ ప్రాంతానికి వచ్చారు. వారందరినీ ఆరు బస్సుల్లో నోవి సంఝారీ హాస్పిటల్‌కు పరీక్షలకు నిమిత్తం తీసుకొచ్చారు. ఆ తర్వాత వారందరినీ పరిశీలనలో ఉంచి 14 రోజుల తర్వాత ప్రత్యేక బలగాలతో వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు ఆందోళనకారులు... ఈ వైరస్ బారినపడివారు జీవించివుండటానికి వీల్లేదని పేర్కొంటూ వారిని తరలిస్తున్న బస్సుకు నిప్పంటించారు. అయితే, అదృష్టవశాత్తు వారిలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు.