యువతిని గర్భవతిని చేసిన బాలుడు.. భయంతో విషం సేవించాడు...

గురువారం, 11 జులై 2019 (13:47 IST)
ఓ యువతిని గర్భవతిని చేసిన బాలుడు ఆ తర్వాత ఏం చేయాలో తెలియక భయంతో వణికిపోయాడు. చివరకు దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువారూరు జిల్లా, మన్నార్‌గుడి సమీపాన పరవాకోటై అనే గ్రామానికి చెందిన యువతికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. 
 
దీంతో తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ యువతికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు... గర్భవతి అని తేల్చారు. వెంటనే గర్భస్రావం చేయాలని ఆ యువతి పట్టుబట్టింది. అయితే, గర్భందాల్చి ఆర్నెల్లు దాటిపోవడంతో అది సాధ్యపడదని వైద్యులు చెప్పారు. ఆ తర్వాత ఆమె వద్ద తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. పైగా, దీనిపై మన్నార్గుడి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో యువతిని గర్భవతిని చేసింది పరవకోటై తోపు వీధికి చెందిన సామియప్పన్‌ అనే 16 యేళ్ళ బాలుడుగా గుర్తించారు. పైగా, ఆ యువతికి ఇతను సోదరుడు వరుస అవుతాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడని యువతి వాపోయింది. 
 
దీంతో ఆ యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, విషయం తెలిసిన సామియప్పన్ విషం సేవించాడు. దీన్ని గమనించిన అతని సోదరుడు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు