రిలయన్స్ జియో కొత్త పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గత ఏడాది ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్‌లను వడ్డించిన జియో.. వినియోగదారులకు ఊరట నిచ్చేలా.. ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది.