4జి డేటా స్పీడు : టాప్ గేర్‌లో జియో.. అట్టడుగున ఐడియా

గురువారం, 20 డిశెంబరు 2018 (09:01 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం కంపెనీ మరోమారు తన సత్తాచాటింది. 4జీ డేటా స్పీడ్, నెట్‌వర్క్ పనితీరులో అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి గత నెలలో ఈ నెట్‌వర్క్ పనితీరు ఇతర కంపెనీలతో పోల్చుకుంటే కాస్త వెనుకబడింది. కానీ, నవంబరు నెలలో మళ్లీ పుంజుకుని మొదటి స్థానంలో నిలిచింది. 
 
తాజాగా టెలికాం నియంత్రణ మండలి (ట్రాయ్) విడుదల చేసిన డేటా ప్రకారం జియో డేటా దూకుడు కొనసాగుతోంది. అయితే గత నెలలో నెట్‌వర్క్‌ పనితీరు కాస్త తగ్గినప్పటికీ 4జీ స్పీడ్‌లో మళ్లీ టాప్‌ స్పాట్ దక్కించుకుంది. నవంబర్‌లో నెలలో జియో స్పీడ్ 20.3 మెగాబిట్ పర్ సెకన్‌గా ఉంటే... ఎయిర్‌టెల్ 9.7 ఎంబీపీఎస్‌గా, వొడాఫోన్ 6.6 ఎంబీపీఎస్‌గా, ఐడియా 6.2గా ఉందని ట్రాయ్ వెల్లడించింది. అంటే 4జీ స్పీడులో జీయో టాప్ స్పాట్‌లో ఉంటే... ఐడియా అట్టడుగులో ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు