జర్మనీలో ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు కూడా అక్కడ ప్రారంభం అయ్యాయి. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. హోల్ పంచ్ డిస్ ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందని అమెజాన్ ఇప్పటికే టీజ్ చేసింది.
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో రానున్న ఈ ఫోన్ ధరను అక్కడ 360 యూరోలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.31,500) నిర్ణయించారు. బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.
స్టోరేజ్ సామర్థ్యం 128 జీబీ.. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గా ఉంది.
దీంతో పాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా ఇందులో ఉన్నాయి.