తాజాగా శాంసంగ్ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో రిలీజ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.
ఈ ఫోన్ ధర 1,999 చైనీస్ యువాన్లు. అంటే ఇండియాలో సుమారు రూ.23,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో రిలీజ్ అయింది. చైనాలోనే అందుబాటులో ఉంది. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు.
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 5జీ స్పెసిఫికేషన్స్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
డిస్‌ప్లే: 6.6 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే
బ్యాటరీ: 4,500ఎంఏహెచ్ (25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + వన్ యూఐ 3.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, వైట్
ధర: సుమారు రూ.23,000.
రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ పోర్ట్‌రైట్ సెన్సార్.