ఆర్థిక లావాదేవీలకు ఎస్బీఐ కొత్త మొబైల్ అప్లికేషన్ యోనో

శనివారం, 25 నవంబరు 2017 (12:51 IST)
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు అన్ని రకాల ఆర్థిక లావాదేవీల కోసం సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. దీనికి యూ ఓన్లీ నీడ్ వన్ (వైఓఎన్‌ఓ) పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ఈ మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అన్ని రకాల ఫైనాన్షియల్‌, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులను ఈ యాప్‌ అందించనుంది. ఈ యాప్‌ ద్వారా 14 కేటగిరీల్లో ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, క్యాబ్‌ బుకింగ్స్‌ నుంచి మెడికల్‌ చెల్లింపుల వరకు యాప్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చని బ్యాంకు పేర్కొంది. కస్టమర్ల అవసరాలు తీర్చేందుకుగాను 60 ఇ-కామర్స్‌ కంపెనీలు (అమెజాన్‌, ఓలా, ఫ్లిప్‌కార్ట్‌, యాత్రా, స్విగ్గీ వంటివి), ఆఫ్‌లైన్‌ సంస్థలతో చేతులు కలిపినట్టు తెలిపింది.
 
ముఖ్యంగా, ఆధార్‌, వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ సాయంతో ఎస్‌బీఐలో డిజిటల్‌ పద్ధతిలో ఖాతా ప్రారంభించేందుకు, లావాదేవీలు జరుపుకునేందుకు, గృహ-వాహన రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు, నగదు బదిలీకి, ముందస్తుగా ఆమోదించిన వ్యక్తిగత రుణం పొందేందుకు, వేర్వేరు ఇ కామర్స్‌ పోర్టళ్లలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరిపేందుకు, కాలావధి డిపాజిట్లకు అనుగుణంగా ఓవర్‌ డ్రాఫ్‌ సదుపాయం పొందేందుకు ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. 
 
అలాగే, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లలో కూడా ఈ యాప్‌ వినియోగించుకోవచ్చు. ఎస్‌బీఐతో పాటు అనుబంధ సంస్థలైన ఎస్‌బీఐ లైఫ్‌, ఎస్‌బీఐ జనరల్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ క్యాప్స్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌ సేవలన్నీ ఈ యాప్‌లో నిక్షిప్తం చేసినట్లు బ్యాంక్‌ తెలిపింది. ఒకరకంగా ఇది ఎస్‌బీఐ డిజిటల్‌ బ్యాంక్‌గా అభివర్ణించింది. డిజిటల్‌ పద్ధతిలో ఖాతా ప్రారంభించిన వారు, ఏదేని ఎస్‌బీఐ శాఖలో వేలిముద్ర ద్వారా ఆధార్‌ను ధ్రువీకరించుకుంటే, ఇక ఈ ఖాతాకు ఆటంకాలు ఏమీ ఉండవు. 

 

It’s here! From banking needs to lifestyle desires, conduct all transactions with one fabulous new app. Clear the clutter and learn more about YONO by SBI. Download Now: https://t.co/v3Ipj04VLB #YouOnlyNeedOne! pic.twitter.com/adSfAkrTfi

— State Bank of India (@TheOfficialSBI) November 24, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు