Sony India నుంచి WF-C500 ట్రూలీ వైర్‍లెస్ ఇయర్ బడ్స్, ధర ఎంతో తెలుసా?

సోమవారం, 10 జనవరి 2022 (22:12 IST)
Sony India ఈరోజు ఇండస్ట్రీ లీడింగ్ ఇన్నోవేషన్స్‍తో తన కొత్త వైర్‍లెస్ ఇయర్ బడ్స్ WF-C500ని ప్రకటించింది. ఈ నెక్స్ట్ జనరేషన్ ఇయర్ బడ్స్ ఒక వ్యక్తిగతీకరించిన మరియు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి తయారు చేయబడ్డాయి, ఇవి Sony తన అభివృద్ధి ప్రక్రియలో కీలకంగా ఉంచిన అంశాలు. కాంపాక్ట్ WF-C500 ట్రూలీ వైర్‍లెస్ ఇయర్ బడ్స్ అనేవి ప్రత్యేకమైన సౌండ్ అనుకూలీకరణ, వాడుకలో సౌలభ్యం, ప్రయాణంలో మ్యూజిక్, ఎంటర్టెయిన్మెంట్ కోసం సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ మరియు వాటర్ రెసిస్టెన్స్‍తో హై క్వాలిటీ సౌండ్‍ని మిళితం చేస్తాయి.

 
Sony సరికొత్త వైర్‍లెస్ ఇయర్ బడ్స్ ట్రూలీ వైర్‍లెస్ ఇయర్ బడ్స్‌కు మారి మరింత మెరుగైన క్వాలిటీలో మ్యూజిక్ ఆనందించాలనుకునే యూజర్లకు తగినవి. ప్రత్యేకమైన సౌండ్ కస్టమైజేషన్, కాంపాక్ట్ డిజైన్, ఉపయోగించడానికి సులభమైన Bluetooth పెయిరింగ్, ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ లైఫ్ మరియు వాటర్ రెసిస్టెంట్ డిజైన్‍తో యూజర్లు ఇప్పుడు తమ సంగీతాన్ని ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకు వెళ్ళవచ్చు.

 
1. సాటిలేని సౌండ్ మరియు కాల్ క్వాలిటీ కోసం డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్(DSEE)తో వస్తుంది. హై క్వాలిటీ సౌండ్ అందించడానికి WF-C500 అనేది DSEE (డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజిన్)తో వస్తుంది. ఇది మీరు వింటున్న ట్రాక్‍కు హై ఫ్రీక్వెన్సీ సౌండ్ మరియు ఫైన్ ఫేడ్-అవుట్ సౌండ్‍ని రిస్టోర్ చేసి మరింత ప్రామాణికమైన శ్రవణానుభవాన్ని సృష్టిస్తుంది. WF-C500 “Sony హెడ్‍ఫోన్స్ కనెక్ట్” యాప్‍లోని ఈక్వలైజర్ సెట్టింగ్ ఉపయోగించి సౌండ్‍ని అనుకూలంగా చేయడానికి కూడా యూజర్‍లను అనుమతిస్తుంది.

 
2. కాల్స్ మరియు అంతరాయం లేని మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం 20 గంటల వరకు లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ లైఫ్
ఇయర్ బడ్స్ 10 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి, సులభ ఛార్జింగ్ కేస్ కారణంగా, యూజర్లు 20 గంటల వరకు వినే సమయాన్ని ఆనందించవచ్చు. WF-C500 ప్రయాణంలో వినడానికి సరైనవి మరియు హడావిడిలో ఉన్నట్లయితే యూజర్ ఒక 10-నిమిషాల క్విక్ ఛార్జ్ తో బ్యాటరీ లైఫ్‍ని సులభంగా టాప్ అప్ చేయవచ్చు, ఇది ఒక గంట వరకు అదనపు ప్లేటైమ్ ఇస్తుంది. 

 
3. వర్కవుట్ కోసం IPX4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‍తో అపరిమితమైన మ్యూజిక్ ఆనందం.
కొత్త WF-C500 ఒక IPX4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‍తో వస్తుంది, కాబట్టి చిందడాలు మరియు చెమటలు WF-C500కి ఎటువంటి సమస్య కావు. మ్యూజిక్‍కు అనుగుణంగా లయ ఆనందిస్తూ మీ వర్క్ఔట్ కొనసాగించండి.

 
4. సౌకర్యవంతమైన, కాంపాక్ట్ మరియు స్టైలిష్ డిజైన్ వాటిని సరైన తోడుగా చేస్తుంది.
చిన్నగా మరియు తేలికగా ఉండేలా డిజైన్ చేయబడి WF-C500 చెవులలో సురక్షితంగా సరిపోతుంది, మీరు ఎక్కడికి వెళ్లినా అవి సరైన తోడుగా ఉంటాయి. WF-C500 యొక్క స్థూపాకార ఛార్జింగ్ కేస్ చిన్నది మరియు జేబులో లేదా బ్యాగ్‍లో తీసుకెళ్లడం సులభం, ఫ్రాస్టెడ్ గ్లాస్ వంటి ఆకృతితో దాని అపారదర్శక మూత ఆ కేస్‍కు స్టైలిష్, లగ్జూరియస్ లుక్ మరియు అనుభూతిని ఇస్తాయి.

 
5. సులభమైన ఆపరేషన్ బటన్లతో ఇబ్బంది లేని మరియు సునాయాసమైన శ్రవణానుభవాన్ని ఆనందించండి.
ప్రతిరోజూ వినడాన్ని ఇబ్బంది లేకుండా చేయడానికి WF-C500 ప్రత్యేకంగా రూపొందించబడింది. సులభమైన ఆపరేషన్ బటన్లు ప్లే చేయడానికి, ఆపడానికి లేదా ట్రాక్స్ దాటవేయడానికి మరియు వాల్యూమ్ అడ్జస్ట్ చేయడానికి అనుమతించడమే కాక - అవి హ్యాండ్స్-ఫ్రీగా కాల్స్ చేయడానికి మరియు అందుకోవడానికి ప్రిఫర్ చేసే వాయిస్ అసిస్టెంట్‍- Google Assistant లేదా Siriని యాక్సెస్ చేయడానికి సులభమైన మార్గాన్ని కూడా అందిస్తాయి.


స్థిరమైన మరియు విశ్వసనీయమైన Bluetooth కనెక్షన్ అవాంతరాలు లేని మరియు అంతరాయం లేని శ్రవణానుభవాన్ని సృష్టిస్తుంది. ఆప్టిమైజ్ చేసిన యాంటెన్నా డిజైన్‍తో పాటు WF-C500 యొక్క Bluetooth చిప్ ఏకకాలంలో ఎడమ మరియు కుడి చెవులకు సౌండ్ ప్రసారం చేసి అత్యుత్తమ శ్రవణాన్ని నిర్ధారిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు