తమ మొబైల్ యూనిట్‌ను విక్రయించే ఉద్దేశమేది లేదని ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ సోనీ స్పష్టంచేసింది. దీంతో గడిచిన కొన్ని రోజులగా స్మార్ట్‌ఫోన్ విభాగాన్ని విక్రయించనున్నట్లు వస్తున్న పుకార్లకు సంస్థ తెరదించినట్లు అయింది. స్మార్ట్‌ఫోన్ బిజినెస్ యూనిట్ ఒక్కసారిగా భారీ వృద్ధిని నమోదు చేసుకోలేకపోయినప్పటికీ విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని స్పష్టం చేసింది.