స్పాటిఫై టెక్నాలజీ నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

సోమవారం, 23 జనవరి 2023 (19:16 IST)
స్పాటిఫై టెక్నాలజీ ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అక్టోబర్‌లో సంస్థకు చెందిన గిమ్ లెట్ మీడియా అండ్ పోడ్ కాస్ట్ స్టూడియోకు చెందిన 38 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఈసారి మరికొంత మందిని తొలగించేందుకు ఏర్పాట్లు చేసిందని సమాచారం. 
 
స్పాటిఫై 9,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరిలో ఎంతమిదిని తొలగించనుందనే విషయంపై స్పష్టతరావాల్సి వుంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు స్పాటిఫై సంస్థ అధికార ప్రతినిధి నిరాకరించారు. 
 
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 12వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గత శుక్రవారం ప్రకటించింది. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో  6 శాతానికి సమానం. అమేజాన్ మెటా, మైక్రోసాఫ్ట్ వంట కంపెనీలు  కొత్త రిక్రూట్‌‌మెంట్లు నిలిపేశాయి. 
 
భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2023లో మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 24వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు