ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశాడు.. ఆ దేవాలయం వద్దకు వచ్చి నన్ను పిలవండి అన్నాడు..

గురువారం, 9 జులై 2020 (21:03 IST)
Flipkart
ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌లో ఆర్డర్ చేయాలంటే.. మన చిరునామా తప్పనిసరి. లేనట్లైతే ఆ ఆర్డర్ బుక్ కాదు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ వినియోగదారుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఓ వస్తువును ఆర్డర్‌ పెట్టాడు. ఆ ఆర్డర్‌లో తన అడ్రస్‌ను మాత్రం వింతగా రాశాడు. అడ్రెస్స్ లో '444 చాత్‌ దేవాలయం. అక్కడికి వచ్చి నన్ను పిలవండి. నేను వస్తాను' అని రాశాడు. 
 
ఈ సంఘటన రాజస్థాన్‌లోని కోటాలో జరిగింది. ఆ వినూత్న అడ్రెస్స్ ఉన్న ప్యాకేజి ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అవుతుంది. దీనిపై నెటిజన్లు వింతగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ సంస్థ స్పందించింది. ఆ ప్యాకేజీ ఫోటోను ఫ్లిప్ కార్ట్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. 'ప్రతి ఇల్లు ఓ ఆలయమే.. ఇది సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది' అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు