వోవైఫై అంటే?
వోవైఫై పూర్తి పేరు ‘వాయిస్ ఓవర్ వైఫై’. అంటే వైఫై సహాయంతో వాయిస్ కాల్స్ మాట్లాడటం. మనం ఉన్న ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ కవరేజీ ఎక్కువగా లేకున్నా, సిగ్నల్‌లో పదేపదే హెచ్చుతగ్గులున్నా కాల్ మాట్లాడటంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకుగాను ఈ సాంకేతికతను తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్(గూగుల్), ఐవోఎస్(యాపిల్) ఇప్పటికే అమెరికాలో వోవైఫైని అనుమతిస్తున్నాయి.
వాట్సప్, స్కైప్‌లతో పనిలేకుండా వైఫై అందుబాటులో ఉన్నప్పుడు ఉచితంగా కాల్‌లు చేసుకునే వెసులుబాటును ప్రస్తుతం వాట్సప్, స్కైప్, ఫేస్‌బుక్, మెసెంజర్ వంటి యాప్‌లు కల్పిస్తున్నాయి.