ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో డిసెంబరు 14న జరిగే జాతీయ లోక్ ఆధాలత్ కు సంబంధించిన కేసుల పరిష్కారానికి డిసెంబరు 2 ,సోమవారం నుండి హైకోర్టులో ముందస్తు బెంచీలు ఏర్పాటుచేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సెక్రటరీ యం. వి.రమణకుమారి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
హైకోర్టులో పెండింగులో ఉన్న మోటారు వాహన ప్రమాద సంబంధ అప్పీళ్ళు , సర్వీస్ రిట్స్, పెన్షన్ రిట్స్, రెవెన్యూ కేసులు , ల్యాండ్ ఎక్విజిషన్ అప్పీళ్ళు , చెక్ బౌన్స్ అప్పీళ్సు, కుటుంబ తగాదాలు, రాజీపడదగిన క్రిమినల్ అప్పీళ్ళు, ఎపిఎస్ఆర్టీసీకి సంబంధించిన అన్ని రిట్స్, మనీ అప్పీళ్ళు, బ్యాంక్, చిట్ ఫండ్ కేసులకు సంబంధించిన అప్పీళ్ళు మొదలైన కేసులు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించబడతాయని ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం 0863 - 2372604 ఫోన్ నెంబరులో ఆఫీసు వేళల్లో సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు.