దేశీయ టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదుపుతున్న రిలయన్స్ జియోకు మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. జియో ఇస్తున్న ఆఫర్ కంటే మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.103లకే ఉచిత అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, 4జీ డేటాను కూడా ఇస్తామని తెలిపింది.
ఇందుకోసం టెలినార్ వినియోగదారులు... రూ.103 తో రీచార్జీ చేసుకొంటే ఈ పథకం వర్తిస్తోంది. అలాగే, కొత్తగా టెలినార్ కస్టమర్లుగా మారితే వారికి కూడ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. 2జీబీ డేటా లిమిట్ పూర్తైతే 128 కెబిపీఎస్ స్పీడ్‌కు డేటా పడిపోతోంది.