అమెరికాలో నిషేధానికి చేరువలో ఉన్న చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీకి విక్రయించేందుకు దాని పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ నిరాకరించింది. దీంతో అమెరికా వరకు టిక్‌టాక్‌ను కొనుగోలు చేసి తమ దేశ పౌరులకు సైబర్ భద్రతతో పాటు తమకు లాభం చేకూరుతుందనుకున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు నిరాశే ఎదురైంది.
సెప్టెంబర్ 15లోగా టిక్ టాక్ విక్రయంపై బైట్‌డ్యాన్స్ కంపెనీ నిర్ణయం తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువు విధించారు. దీన్ని పొడిగించే ఉద్దేశమే లేదని, ఇష్టముంటే అమెరికా కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని, లేనిపక్షంలో మూసివేయాలని వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే.