ఈ నేపథ్యంలోనే టిక్‌టాక్ తనపై పడిన చైనా ముద్రను తొలగించుకునేందుకు కీలక చర్యలు తీసుకుంటోందని తెలుస్తుంది. బీజింగ్‌లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మరో చోటకు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎక్కడికి తరలిస్తారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.
అయితే.. టిక్‌టాక్ బీజింగ్ ప్రధాన కార్యాలయం తరహాలో ముంబై, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, డబ్లిన్ నగరాల్లో కూడా భారీ కార్యాలయాలు ఉన్నాయి. అయితే.. ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉండడంతో టిక్ టాక్ యాప్‌పైన చైనా ప్రభుత్వం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనేక దేశాలు భావిస్తున్నాయి.