వాట్సాప్‌లో ఇక గ్రూప్ వాయిస్, వీడియో కాల్ సేవలు

బుధవారం, 2 మే 2018 (14:49 IST)
సోషల్ మీడియాల్లో బాగా ప్రాచుర్యమైన వాట్సాప్‌ ద్వారా త్వరలోనే గ్రూప్ వాయిస్, వీడియో కాల్ సేవలు ప్రారంభం కానున్నట్లు... 2014లో వాట్సాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌ తెలిపింది. వాట్సాప్‌లో వీడియో కాల్‌ను ఒకేసారి ఒకరికి మించి గ్రూపు పరిధిలో చేసుకుని అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఈ సేవలను ప్రారంభించనున్నట్లు సీఈవో మార్క్ జుకర్ బెర్గ్ ప్రకటించారు. 
 
ఫేస్‌బుక్ వార్షిక ఎఫ్8 డెవలపర్ల కాన్ఫరెన్స్‌లో ఈ ప్రకటన చేశారు. వాట్సాప్‌లో వాయిస్, వీడియో కాలింగ్‌కు చాలా ఆదరణ వుందని.. రానున్న నెలల్లో గ్రూప్ కాలింగ్ కూడా అందుబాటులో రానుందనే సమాచారం వాట్సాప్ యూజర్లకు ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. డెవలపర్లు అభివృద్ధి చేసిన థర్డ్ పార్టీ స్టిక్కర్లను కూడా వాట్సాప్ అనుమతించనున్నట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు