ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్.. 4జీ బేసిక్ ఫోన్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోనులో వాట్సాప్ సదుపాయం లేదు. త్వరలోనే 4జీ బేసిక్ ఫోన్‌లో వాట్సాప్ యాప్ సదుపాయం తీసుకురానున్నట్లు సమాచారం. వాట్సాప్ యాప్‌ను బేసిక్ ఫోనులో తీసుకొచ్చేందుకు ఇప్పటికే జియా వాట్సాప్‌తో చర్చలు జరుపుతుందని తెలిసింది.
ఇదిలా ఉంటే.. శామ్‌సంగ్ సంస్థ రిలయెన్స్ జియోతో జతకట్టింది. శామ్‌సంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్ల అమ్మకం కోసం రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ ద్వారా గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్ ఫోన్లు రిలయన్స్ డిజిటల్, జియో వెబ్‌సైట్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ వెబ్‌సైట్ ద్వారా శామ్‌సంగ్ ఫోన్లు క్యాష్ బ్యాక్ ఆఫర్లతో లభిస్తాయని జియో వెల్లడించింది.